Type Here to Get Search Results !

Work From Home jobs in LIC: LICలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

SaiTej 0

 Work From Home jobs in LIC: Only Females are Eligible (Mahila Career Agents)


LIC AGENTS

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సంస్థ ఇండియాలో అత్యంత నమ్మకమైన, అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఈ సంస్థలో ఉద్యోగం వస్తే చాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్రం శుభవార్త తెచ్చింది.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మధ్య LIC భీమా సఖి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా.. మొదటి సంవత్సరం లక్ష మంది మహిళలు ఉద్యోగాలు పొందనున్నారు. ఈ ఉద్యోగం పొందాలంటే.. 10వ తరగతి పాసై ఉండాలి. వారికి LICలో భీమా సఖిగా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్ కూడా ఇశ్తారు.


1. ఏం ఉద్యోగం:

ఎల్ఐసీలో బీమా సఖి ఏజెంట్లుగా ట్రైనింగ్ పొందేవారు.. ఇంటిదగ్గరే ఉంటూ.. ఎఐసీ పాలసీలను అమ్మాలి. ఎలా అమ్మాలో, ఏ పాలసీని ఎలా, ఎవరికి సెట్ చెయ్యాలో, పాలసీల గురించి ఎలా వివరించాలో.. అన్నీ ఎల్ఐసీ సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది. అందువల్ల ప్రజలు పాలసీలు తీసుకునేలా చెయ్యడం తేలికే అవుతుంది. ఇక్కడ స్టైపెండ్‌తోపాటూ.. ప్రతీ పాలసీకీ కమిషన్ కూడా లభిస్తుంది. ఇప్పటికే ఇలాంటి పనులను మగవారు, ఎల్ఐసీ ఏజెంట్లుగా చేస్తున్నారు. ఐతే.. ఈ కొత్త ఉద్యోగాల్లో ట్రైనింగ్ కూడా ఇస్తూ చేయిస్తారు కాబట్టి.. మహిళలు కూడా మరిన్ని పాలసీలు చేయించేందుకు వీలవుతుంది.


2. ట్రైనింగ్ తర్వాత ఏంటి?

మూడేళ్లు ట్రైనింగ్ పూర్తయ్యాక, టెన్త్ పాసైనదీ లేనిదీ మరోసారి చెక్ చేస్తారు. LIC ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారతారు. 

టెన్త్ కాకుండా.. డిగ్రీ కూడా పూర్తి చేసి ఉంటే, అలాంటి మహిళలను LIC డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేస్తారు. అందువల్ల మహిళలకు ఇదో మంచి అవకాశంగా మారుతుంది.


3. అర్హతలేంటి:

i. మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు.

ii. పదో తరగతి పాసై ఉండాలి.

iii. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉండొచ్చు.


4. జీతం లెక్కలు: 

జీతాలను డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్‌లోనే వేస్తారు.

1వ సంవత్సరం: నెలకు రూ.7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

2వ సంవత్సరం: నెలకు రూ.6,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

3వ సంవత్సరం: నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.


ఈ సంపాదన పెంచుకోవడానికి.. ప్రతీ పాలసీకీ కమిషన్ వస్తుంది. అలా పాలసీలు పెరిగే కొద్దీ కమిషన్ల రూపంలో బాగా సంపాదించవచ్చు.


దరఖాస్తు ఎలా:

ముందుగా ఈ లింక్ లోకి వెళ్లాలి. ఇందులో పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రెస్, పిన్ కోడ్ వంటి వివరాలు ఇచ్చి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి. అలాగే ఎవైనా పత్రాలు కోరితే, వాటిని అప్‌లోడ్ చెయ్యాలి.


HOW TO APPLY:

Apply Now: 


Official Website: Click Here

Post a Comment

0 Comments