Type Here to Get Search Results !

RRB GroupD Recruitment: రైల్వేలో 32,000 గ్రూప్-డి పోస్టులు

SaiTej 0

  Railway Recruitment  


Railway Recruitment - 2024

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. 


 JOIN What's Group Link


ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. దీనిలో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది.


ఆర్ఆర్బి రీజియన్లు: 

అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్్పుర్, కోల్కతా, మాల్టా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్.


ప్రకటన వివరాలు:

లెవల్-1 గ్రూప్-డి: 32,000 ఖాళీలు (సుమారుగా)


పోస్టులు: 

పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి.


విభాగాలు: ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.


అర్హత: 

పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 

01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.


ప్రారంభ వేతన: నెలకు రూ.18,000.


ఎంపిక ప్రక్రియ: 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.


దరఖాస్తు రుసుము: 

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.


ముఖ్య తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.

 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.


 గమనిక: పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్ తదితర వివరాలను ఆర్ఆర్బీ త్వరలో విడుదల చేయనుంది.


ముఖ్యాంశాలు:

  • దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్-డి ఖాళీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తోంది.
  •  ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది.

HOW TO APPLY:

       APPLY  NOW         


OTHER POSTS:







Post a Comment

0 Comments