Type Here to Get Search Results !

Post Office: దేశవ్యాప్తంగా కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త చెప్పిన పోస్టాఫీస్..

SaiTej 0

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్


POST OFFICE RECURING SCHEME


మీరు రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే, పోస్టాఫీసు పొదుపు పథకాలు మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి.


మీరు రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే, పోస్టాఫీసు పొదుపు పథకాలు మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి. ముఖ్యంగా.. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ ఒక నమ్మకమైన , రాబడికొచ్చే ఎంపికగా ఉంటుంది. 


ఈ పథకం ద్వారా మీ డబ్బును సరైన విధంగా నిల్వ చేసి, ఎక్కువ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. RD పథకంలో నెలకు కనీసం రూ.100 తో ఖాతా ప్రారంభించవచ్చు. ఇది సింగిల్ లేదా జాయింట్ ఖాతాలుగా అందుబాటులో ఉంటుంది. ఈ పథకంపై ప్రతి సంవత్సరం 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. 


ఉదాహరణకు.. 

మీరు రోజుకు రూ.333 పొదుపు చేస్తూ, నెలకు సుమారు రూ.10,000 డిపాజిట్ చేస్తే, ఐదేళ్లలో మీరు రూ.5,99,400 సేకరించవచ్చు. ఈ పథకాన్ని 10 సంవత్సరాల పాటు కొనసాగిస్తే.. మీరు మీ డిపాజిట్లతో పాటు వడ్డీని కలిపి రూ. 17,08,546 పొందవచ్చు.   


ఈ పథకం ప్రధాన ప్రయోజనం ఏమిటంటే

దీన్ని ఉపయోగించడానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వ హామీతో నడుస్తుంది. 


ఈ పథకంలో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. పథకం సౌలభ్యాల వల్ల యువత నుంచి పెద్దవారివరకు అందరికీ ఇది అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా మరింత భద్రతతో చేయాలనుకుంటే.. పోస్టాఫీసు RD పథకం మీ కోసం ఒక ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.

Post a Comment

0 Comments