Type Here to Get Search Results !

IPPB Specialists: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు

SaiTej 0

 IPPB Specialists: Indian Post Payment banks Posts

globalinfo9
Postal |Recruitment 2024


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది, అర్హులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


1. ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54 పోస్టులు


2. మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు


3. మేనేజర్ ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 02 పోస్టులు


4. మేనేజర్-ఐటీ (ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌన్): 01 పోస్టు


5. సీనియర్ మేనేజర్- ఐటీ (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు


6. సీనియర్ మేనేజర్- ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 01 పోస్టు


7. సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఎస్ఎల్ఎ, పేమెంట్స్): 01 పోస్టు


8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్టు: 07 పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 68.


2. అర్హత:

పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్). 

(లేదా) బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్). లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.


2. వయోపరిమితి: 

01.12.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 20-30 ఏళ్ళు, మేనేజర్‌కు 23-35 ఏళ్లు, | సీనియర్ మేనేజరు 26-35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టు 50 ఏళ్లు మించకూడదు.


3. పే స్కేల్: 

నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.2,25,937. మేనేజర్‌కు రూ.1,77,146, సీనియర్ మేనేజర్ కు రూ.1,40,398 చెల్లిస్తారు.


4. దరఖాస్తు రుసుము: 

రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).


5. ఎంపిక ప్రక్రియ:

 ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా.


6. ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.12.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2025.


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్- రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


HOW TO APPLY:

APPLY NOW:



NOTIFICATION PDF: Click here
OFFICIAL WEBSITE: Click here


Post a Comment

0 Comments