Type Here to Get Search Results !

మీ సేవ సెంటర్​ పనులు మీ ఫోన్​ నుంచే చేసుకోవచ్చు!- లాగిన్​ ఐడీ ఇలా పొందండి

SaiTej 0
How to Apply for Mee Seva Login ID: 

విద్యార్థులు, పౌరులు, రైతులు ఎవరైనా సరే.. ఏదైనా సర్టిఫికెట్​ కావాలంటే దగ్గరలోని "మీ సేవ" కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే.. అంత దూరం వెళ్లాల్సిన పని లేకుండా.. కేవలం ఇంట్లో ఉండే మొబైల్​​ లేదా కంప్యూటర్​ ద్వారా సులభంగా పలు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరి, అది ఎలా సాధ్యమవుతుంది? ఎలాంటి సేవలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. సిటిజన్​ లాగిన్​ ఐడీ :
గతంలో మీ సేవ ఆపరేటర్లకు మాత్రమే లాగిన్​ ఐడీలు ఉండేవి. అంటే.. ఆ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే ఆ సేవలు అందించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. "మీ సేవ" ద్వారా కావాల్సిన పనులు చేసుకునేందుకు అందరికీ అవకాశం కల్పించారు. అదే.. "సిటిజన్ లాగిన్". ఈ లాగిన్​ ఐడీ ద్వారా చాలా వరకు పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. ఆ ఐడీ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.

i. హోమ్​ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్​లో New User ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

ii. అప్పుడు మీకు స్క్రీన్​ మీద రిజిస్ట్రేషన్​ ఫారమ్​ కనిపిస్తుంది. అందులో మొబైల్​ నెంబర్​, పాస్​వర్డ్​, పేరు, ఈమెయిల్​, అడ్రస్​ సహా తదితర వివరాలు ఎంటర్​ చేసి Submit ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

iii. అప్పుడు మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేసి Submit చేస్తే మీ రిజిస్ట్రేషన్​ పూర్తవుతుంది. మీ లాగిన్​ వివరాలు సేవ్​ చేసుకోవాలి.

iv. ఇప్పుడు ఈ లాగిన్​ ఐడీ ఉపయోగించి మీకు కావాల్సిన సేవలు పొందాలి.

2. ఎలా లాగిన్​ కావాలంటే:
ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. 

i. హోమ్​ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్​లో రిజిస్ట్రేషన్​ సమయంలో మీరు ఎంటర్​ చేసిన మొబైల్​ నెంబర్​, క్రియేట్​ చేసుకున్న పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి Login ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

ii. మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది.

iii. దానిని ఎంటర్​ చేసి సబ్మిట్​ చేస్తే స్క్రీన్​ మీద పలు రకాల సేవలు కనిపిస్తాయి.

iv. అందులో మీకు కావాల్సిన సేవలు మీద క్లిక్​ చేసి అప్లై చేసుకోవచ్చు.

3. లాగిన్​ ఐడీ పొందిన తర్వాత లభించే సేవలు:
- TSRTA
- రెవెన్యూ
- జీహెచ్​ఎంసీ
- సీడీఎంఏ
- టీజీఎస్పీడీసీఎల్
​- గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సేవలు
- పోలీసు శాఖకు సంబంధించిన సేవలు
- విద్యకు సంబంధించిన సేవలు
- సహా పలు ఇతర సేవలు కూడా లభిస్తాయి.

Post a Comment

0 Comments